Header Banner

రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్! పార్టీ కార్యకర్తల జోలికి వస్తే..

  Mon May 05, 2025 14:03        Politics

రాయలసీమ గడ్డ తన అడ్డా అని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారని నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తుచేశారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి రూ. 136 కోట్ల నివేదికలు సిద్ధం చేశామని అన్నారు. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం.. హిందూపురం ప్రజలు మర్చి పోలేనిదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations